రోవర్ తీసిన ల్యాండర్ చిత్రం
Pragyan rover | బెంగళూరు, ఆగస్టు 30: జాబిల్లిపై మరో వారం రోజుల్లో రాత్రయి వెలుతురు మందగించే అవకాశం ఉండటంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అలుపెరగకుండా పరిశోధనలు చేస్తున్నాయి. ఇటీవల చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతలను విక్రమ్ వెల్లడించగా… మానవాళి జీవనానికి ఆధారమైన ఆక్సిజన్ జాడలను రోవర్ తెలిపింది. తాజాగా బుధవారం రోవర్ ప్రజ్ఞాన్.. విక్రమ్‌ను క్లిక్మనింపించింది. నావిగేషన్ కెమెరా సాయంతో ‘స్మైల్ ప్లీజ్’ అంటూ ల్యాండర్ చిత్రాన్ని బంధించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఇస్రో పంచుకున్నది. ‘స్మైల్ ప్లీజ్.. నావిగేషన్ కెమెరా సాయంతో ప్రజ్ఞాన్ రోవర్ బుధవారం ఉదయం విక్రమ్ ఫొటోలను చిత్రీకరించింది’ అని ఇస్రో తెలిపింది.
Chandrayaan-3 Mission:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE
— ISRO (@isro) August 30, 2023