మరింత త్వరితంగా వీసా అపాయింట్మెంట్
అమెరికా వెళ్లాలనుకొనే భారతీయులకు వీసా అపాయింట్మెంట్పై కొత్త నిబంధనలను అమలుచేయనున్నట్టు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నిబంధనలు జనవరి ఒకటో తేదీనుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.
- గడువును తగ్గించిన అమెరికన్ ఎంబసీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: అమెరికా వెళ్లాలనుకొనే భారతీయులకు వీసా అపాయింట్మెంట్పై కొత్త నిబంధనలను అమలుచేయనున్నట్టు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నిబంధనలు జనవరి ఒకటో తేదీనుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం వీసా అపాయింట్మెంట్ కోసం వేచి చూసే గడువు తగ్గుతుందని పేర్కొంది. అందరికీ సమాన అవకాశాలు లభించేలా ఈ మార్పులు చేసినట్టు తెలిపింది.
వీసా కోసం దరఖాస్తు చేసుకొనేవారు ఒకవేళ తమకు లభించిన అపాయింట్మెంట్ రోజున వెళ్లడం వీలుకాకపోతే అదనపు ఫీజు చెల్లించకుండానే ఆ రోజును మరో తేదీకి మార్చుకోవచ్చని వివరించింది. రెండోసారి కూడా వీలుకాకపోతే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకొని, తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. తాము కోరుకున్న ప్రదేశంలోనే వీసా అపాయింట్మెంట్కు వెళ్లవచ్చని తెలిపింది. ప్రస్తుతం బీ1/బీ1 విజిటర్ వీసా అపాయింట్మెంట్ కోసం వేచి చూసే గడువు హైదరాబాద్‌లో 429 రోజులు, చెన్నైలో 479 రోజులు, ఢిల్లీలో 441 రోజులుగా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

