Indian Startups: ఎస్వీబీలో బిలియన్ డాలర్ల భారతీయ స్టార్టప్‌ల డిపాజిట్లు
Indian Startups: ఇటీవల అమెరికాలో ఎస్వీబీ బ్యాంక్ మూతపడిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకులో భారతీయ స్టార్టప్‌లకు చెందిన సుమారు వంద కోట్ల డాలర్ల డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఆ కంపెనీలకు ఇండియన్ బ్యాంక్‌ల ద్వారా క్రెడిట్ లైన్ ఇప్పించనున్నట్లు ఆయన చెప్పారు.
ముంబై: అమెరికాలో ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంకు(Silicon Valley Bank) మూతపడిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాంకులో భారతీయ స్టార్టప్‌ల(Indian Startups)కు చెందిన బిలియన్ డాలర్ల డిపాజిట్లు(Billion Dollar Deposits) ఉన్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మార్చి పదో తేదీన ఎస్వీబీ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ బ్యాంకు మూతపడ్డ సమయంలో దాని వల్ల 209 బిలియన్ల డాలర్ల అసెట్స్ ఉన్నాయి. దివాళా తీస్తున్న విషయం తెలియడంతో .. మూతవేయడానికి ఒక రోజు ముందు ఆ బ్యాంకు నుంచి సుమారు 42 బిలియన్ల డాలర్లను డిపాజిటర్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భారతీయ స్టార్టప్‌ల డబ్బులు ఆ బ్యాంక్‌లో ఉండడం వల్ల ఇప్పుడు ఆ కంపెనీలకు పెద్ద కష్టమే వచ్చింది. పూర్తిగా యూఎస్ బ్యాంకింగ్ వ్యవస్థ(US Banking System)పై ఆధారపడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పుడు కొత్త చర్యలను చేపట్టనున్నది. ఎస్వీబీలో ఉన్న ఫండ్స్‌లో ఇండియన్ స్టార్టప్‌లకు చెందిన బిలియన్ల డాలర్లు ఉన్నట్లు మంత్రి చంద్రశేఖర్(Minister Chandrashekar) అంచనా వేశారు.
ఈ వారంలోనే సుమారు 460 మంది స్టేక్హోల్డర్ల(Stake Holders)ను మంత్రి కలిశారు. ఎస్వీబీ వల్ల ప్రభావానికి లోనైన స్టార్టప్‌లను కూడా ఆయన కలిశారు. ఆ స్టేక్హోల్డర్లు ఇచ్చిన సమాచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Sitharaman)ను చేరవేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎస్వీబీలో ఫండ్స్ ఉన్న స్టార్టప్‌లకు.. ఇండియన్ బ్యాంకులు క్రెడిట్ లైన్(Credit Line) కింద డిపాజిట్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఓ సూచన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

