నేలకేసి కొట్టి.. మోకాలితో తొక్కిపెట్టి
ఆస్ట్రేలియా పోలీసుల కర్కశ చర్య కారణంగా భారత సంతతి వ్యక్తి ఒకరు మెదడు దెబ్బ తిని కోమాలోకి వెళ్లారు. 2020లో యూఎస్‌లో పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది.
- భారత సంతతి వ్యక్తిపై ఆస్ట్రేలియా పోలీసుల కర్కశత్వం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పోలీసుల కర్కశ చర్య కారణంగా భారత సంతతి వ్యక్తి ఒకరు మెదడు దెబ్బ తిని కోమాలోకి వెళ్లారు. 2020లో యూఎస్‌లో పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. స్థానిక మీడియా షేర్ చేసిన వీడియో ప్రకారం బాధితుడు గౌరవ్ కుండిని (42) అడిలైడ్ తూర్పు శివార్లలో పోలీసులు రోడ్డు పైన బలవంతంగా తీసుకెళ్లారు. అదే సమయంలో ఆయన భార్య అమృత్‌పాల్ కౌర్ తన భర్త అమాయకుడని పోలీసులకు విన్నవించారు. ‘నేను ఏ తప్పు చేయలేదు’ అని గౌరవ్ బిగ్గరగా అరిచారు. పోలీసులు అన్యాయంగా ప్రవర్తించారని కౌర్ ఆరోపించారు. ఆస్ట్రేలియా టుడే నివేదిక ప్రకారం గౌరవ్‌ను పోలీసులు నేలకేసి కొట్టడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. తన భర్తను కిందపడేసి, మెడపై మోకాలితో తొక్కిపెట్టారని కౌర్ ఆరోపించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న గౌరవ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అరెస్ట్ చేయాలని ప్రయత్నించినప్పుడు అతడు హింసాత్మకంగా ప్రతిఘటించాడని పోలీసులు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

