Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న భారత్‌కు చెందిన వైద్య విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో అతడి మృతదేహం కనిపించింది. కుమారుడితో పాటు బంగ్లాదేశ్‌లో ఉంటున్న తల్లి అతడి మరణ వార్త తెలుసుకుని ఆసుపత్రిపాలైంది.
శ్రీనగర్: బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న భారత్‌కు చెందిన వైద్య విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో అతడి మృతదేహం కనిపించింది. కుమారుడితో పాటు బంగ్లాదేశ్‌లో ఉంటున్న తల్లి అతడి మరణ వార్త తెలుసుకుని ఆసుపత్రిపాలైంది. (Indian Student Died In Bangladesh) జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన 26 ఏళ్ల అద్నాన్ అల్తాఫ్, బంగ్లాదేశ్‌లోని ఈస్టర్న్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇటీవల కశ్మీర్‌కు వచ్చిన అతడు 15 రోజుల కిందట తల్లితో కలిసి చదువు కోసం తిరిగి బంగ్లాదేశ్ వెళ్లాడు.
కాగా, నవంబర్ 2న క్యాంపస్ నుంచి అద్నాన్ బయటకు వెళ్లాడు. అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేశాడు. ఆ తర్వాత అతడు అదృశ్యమయ్యాడు. ఢాకా-చటోగ్రామ్ హైవేలోని మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న మోనిపూర్ గ్రామంలోని చెరువులో భారత విద్యార్థి మృతదేహం లభించింది. పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కమిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
మరోవైపు అద్నాన్ కొంత కాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ఈస్టర్న్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. కుమారుడిని చూసుకునేందుకు తల్లి కూడా అతడితో పాటు ఉంటున్నట్లు పేర్కొంది. 15 రోజుల క్రితమే వారిద్దరూ భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చినట్లు వివరించింది. నవంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన రెండో ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ మైక్రోబయాలజీ పరీక్షలకు అద్నాన్ హాజరు కావాల్సి ఉన్నదని కాలేజీ అధికారులు వెల్లడించారు.
అయితే బంగ్లాదేశ్‌లో ఉంటున్న అద్నాన్ తల్లి కుమారుడి మరణం గురించి తెలుసుకుని తీవ్ర మనోవేదనతో ఆసుపత్రిపాలైంది. ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని జమ్ముకశ్మీర్‌లోని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అద్నాన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం సహకరించాలని వారు విన్నవించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- body
- college
- Found
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

