ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
- సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల పారదర్శకత, ఓటు హక్కు కోసం ‘ప్రతి చోటా జంతర్‌మంతర్’ పేరిట వివిధ దేశాల్లో వీధుల్లోకి వచ్చారు.
అక్టోబర్ 16న లండన్, జర్మనీలోని ఎర్లాంగెస్లో ప్రారంభమైన నిరసనలు మరుసటి రోజు జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా, చెక్ రిపబ్లిక్‌లోని పలు నగరాలకు విస్తరించాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్తోపాటు న్యూయార్క్‌లోనూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
లండన్‌లో భారత హైకమిషన్ ఎదుట..
స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట నిరసన ప్రదర్శన జరిగింది. ఎన్నికల సమగ్రత కాపాడాలని, సీఈసీ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్వేర్‌లో జరిగిన మరో ప్రదర్శనలో యూట్యూబర్ ధ్రువ్పాల్గొన్నారు.
కెనడా, ఐర్లాండ్‌లో సంఘీభావం
టొరంటోలోని భారత కాన్సులేట్ ఎదుట నిరసనకారులు భారత రాజ్యాంగాన్ని చదివి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నినాదాలు చేశారు. వాంకోవర్లోనూ సుమారు 50 మంది సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. డబ్లిన్‌లో సౌత్ ఏషియా కలెక్టివ్ ఐర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల పేర్లు తొలగింపు, వివరాల్లో మార్పులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఓటు హక్కు కాపాడాలని డిమాండ్ చేశారు.
అమెరికా, నెదర్లాండ్స్‌లోనూ ప్రదర్శనలు
నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట 150 మందికిపైగా సమావేశమై భారత్‌లో నిరసన చేస్తున్నవారికి మద్దతు తెలిపారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలెస్ తదితర నగరాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. న్యూయార్క్‌లో జర్నలిస్టులు, రచయితలు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు పాల్గొని సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

