Radhika Sen: అరుదైన గౌరవం అందుకోనున్న ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్
Radhika Sen: భారతీయ ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్.. అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కాంగోలో యూఎన్ పీస్‌కీపింగ్ మెషీన్లో పనిచేసిన ఆమెకు ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును ప్రదానం చేయనున్నారు.
న్యూఢిల్లీ: భారతీయ ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్(Radhika Sen).. అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కాంగోలో యూఎన్ పీస్‌కీపింగ్ మెషీన్లో పనిచేసిన ఆమెకు ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. యూఎన్ పీస్‌కీపర్‌గా మహిళలు, అమ్మాయిల హక్కుల కోసం ఆమె అసాధారణ పోరాటం చేశారు. 2000 భద్రతా మండలి తీర్మానం ప్రకారం కూడా ఆమెకు గుర్తింపు ఇవ్వనున్నారు. యుద్ధ ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళల్ని రక్షిస్తున్న నేపథ్యంలో ఆర్మీ ఆఫీసర్‌కు అవార్డు అందజేయనున్నారు. యూఎన్ పీస్‌కీపర్స్ ఇంటర్నేషనల్ డే రోజున రాధికా సేన్‌కు అవార్డును ఇవ్వనున్నారు.
రాధికా సేన్ గురించి కొన్ని విషయాలు..
1.హిమాచల్‌ప్రదేశ్‌లో రాధికా సేన్ జన్మించారు. బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌లో ఆమె కెరీర్ ప్రారంభమైంది. భారతీయ ఆర్మీలో చేరే సమయంలో ఆమె బాంబే ఐఐటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.
2.2023లో కాంగోలో చేపట్టిన పీస్‌కీపింగ్ మిషన్‌కు ఆమెను నియమించారు. ఎంగేజ్మెంట్ ప్లటూన్ కమాండర్‌గా ఆమె పనిచేశారు. 2024 ఏప్రిల్ వరకు ఇండియన్ రాపిడ్ డెవలప్మెంట్ బెటాలియన్‌లో చేశారు.
3. మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న రెండో భారతీయ వ్యక్తిగా రాధికా సేన్ నిలిచారు. గతంలో మేజర్ సుమన్ గవాని ఈ అవార్డును అందుకున్నారు. ఆమె దక్షిణ సుడాన్ పీస్ మిషన్‌లో చేశారు. 2019లో ఆమెను సన్మానించారు.
4. యూఎన్ పీస్‌కీపింగ్ ఆపరేషన్స్‌లో సుమారు 6063 మంది భారతీయులు ఉన్నారు. మోనుస్కో మిషన్‌లో 1954 మంది చేశారు. దీంట్లో 32 మంది మహిళలు ఉన్నారు. మహిళ రక్షణ కోసం రాధికా సేన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
5. లింగ సమానత్వం కోసం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో రాధికా సేన్ పనిచేశారు. చిన్న పిల్లలకు ఇంగ్లీష్ తరగతులను ఆమె నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

