ఉగ్రవాదులను పోషిస్తున్న పాకిస్థాన్.. యూఎన్‌లో ఇండియా కౌంటర్

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇండియా. భద్రతా మండలి సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రస్తావించడాన్ని ఇండియా తప్పుపట్టింది. యూఎన్‌లోని భారత కౌన్సలర్ డాక్టర్ కాజల్ భట్ దీనిపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ నుంచి చొరబడే ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉగ్రవాదం, హింస లేని అనుకూల వాతావరణంలో మాత్రమే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందన్నారు. పాకిస్థాన్‌తో సహా అన్ని దేశాలతో ఇండియా సోదర సంబంధాలను ఆశిస్తోందని, ఏవైనా సమస్యలు ఉంటే, అవి ద్వైపాక్షికమైనా, సిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ లాంటి వాటిపైన కూడా శాంతియుతంగా చర్చించనున్నట్లు కాజల్ భట్ తెలిపారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉంటుందని ఆమె అన్నారు. అప్పటి వరకు సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
భారత్‌పై యూఎన్ వేదికగా పాకిస్థాన్ తప్పుడు ప్రచారాలు చేయడం ఇది మొదటిసారి కాదు అని, ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు పాక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని, కానీ ఆ దేశంలో మాత్రం ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, సాధారణ ప్రజలకు, మైనార్టీలకు అక్కడ ఇబ్బందులు తప్పడం లేదని కాజల్ అన్నారు. అంతర్జాతీయ శాంతి అంశంపై పాకిస్థాన్ అంబాసిడర్ మునిర్ అక్రమ్ మాట్లాడుతూ కశ్మీర్ సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన కాజల్ భట్ చాలా తీవ్రస్థాయిలో పాక్‌కు సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులను పెంచి, పోషించే గత చరిత్ర పాకిస్థాన్‌కు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అని ఆమె అన్నారు. యూఎన్ భద్రతా మండలి నిషేధించిన ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పాక్‌లో ఉన్నట్లు కాజల్ ఆరోపించారు. అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాక్ వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఇండియా పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

