Good News Today | ఇండియాలో ఇదే తొలి పాజిటివ్ న్యూస్ చానెల్ అట!
ఇండియాలోనే తొలి, ఏకైక పాజిటివ్ న్యూస్ చానెల్ అంటూ ఇండియా టుడే గ్రూప్ గుడ్‌న్యూస్ టుడే (Good News Today) పేరుతో ఓ చానెల్‌ను లాంచ్ చేసింది.

న్యూఢిల్లీ: ఇండియాలోనే తొలి, ఏకైక పాజిటివ్ న్యూస్ చానెల్ అంటూ ఇండియా టుడే గ్రూప్ గుడ్‌న్యూస్ టుడే (Good News Today) పేరుతో ఓ చానెల్‌ను లాంచ్ చేసింది. న్యూస్ అంటే షాక్‌కు గురి చేసేది, సంచలనం కలిగించేదే కాదు పాజిటివ్ న్యూస్ కూడా అంటూ ఆ గ్రూప్ ఈ చానెల్ లాంచ్ చేయడం విశేషం. అచ్చీ ఖబర్, సచ్చీ ఖబర్ (మంచి వార్త, నిజమైన వార్త) ట్యాగ్‌లైన్‌తో ఈ గుడ్ న్యూస్ టుడే లాంచ్ అయింది. ప్రతికూల వార్తల్లోనూ ఎన్నో నిర్మాణాత్మక కథనాలు ఉంటాయని, కానీ వాటిని ఎవరూ పట్టించుకోరని ఈ సందర్భంగా ఇండియన్ టుడే గ్రూప్ చెప్పింది.
పరిష్కారాలపైనే తమ న్యూస్ చానెల్ దృష్టి పెడుతుందని స్పష్టం చేసింది. గ్లాస్ సగం నిండుగా ఉన్నదన్న కాన్సెప్ట్ తమదని తెలిపింది. బతుకుపై ఓ నమ్మకాన్ని, మానవ విజయాలను, ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో ఓ సానుకూల దృక్పథం అన్నది అవలంబించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్పర్సన్ కాలీ పూరీ అన్నారు. రోజువారీ వార్తలను అందించడం ఆపకున్నా.. వాటి చుట్టూ ఉన్న దృక్పథాన్ని ఈ చానెల్ ద్వారా మార్చే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

