Covid cases | దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
దేశంలో కరోనా కేసులు (Covid cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు (Covid cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది. గత 146 రోజుల్లో ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది. కాగా, గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు 5,30,824 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా మృతిచెందినవారిలో మహారాష్ట్రలో ముగ్గురు ఉండగా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 910 మంది కోలుకున్నారు. మొత్తంగా 4,41,62,832 మంది మహమ్మారినుంచి బయటపడ్డారు. మరో 8601 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.33 శాతంగా ఉండగా, 0.02 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.79 శాతం మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.65 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ (Health ministry) వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

