న్యూఢిల్లీ, జనవరి 30: గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్‌లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 85వ ర్యాంకులో నిలిచిన భారత్.. ఈ సారి మరింత దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 2023 ఏడాదికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ ర్యాంకులను విడుదల చేసింది.
ప్రభుత్వ రంగంలోని అవినీతిపై నిపుణులు, వ్యాపార వేత్తలు తదితరుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా 0 నుంచి 100 స్కేల్ ద్వారా ఈ సూచీని తయారు చేశారు. ఇందులో సున్నాను అత్యంత అవినీతిగా, 100ను స్వచ్ఛమైనదిగా లెక్కకడుతూ స్కోర్ ఇచ్చారు. 2023లో భారత్ స్కోర్ 39 కాగా, 2022లో ఈ స్కోర్ 40గా ఉన్నది.