అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం… కీలక పరీక్ష విజయవంతం
దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది. అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం ప్రయోగించింది. కీలకమైన ఈ పరీక్షలో విజయం సాధించింది.
న్యూఢిల్లీ: దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది. అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం ప్రయోగించింది. కీలకమైన ఈ పరీక్షలో విజయం సాధించింది. అణు జలాంతర్గామి ద్వారా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ ఆయుధ వ్యవస్థ, కార్యాచరణ, సాంకేతిక పరిమితులను దీని ద్వారా ధృవీకరించినట్లు పేర్కొంది. జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం (ఎస్ఎల్బీఎం) భారత నౌకాదళ అణు నిరోధకత, దేశ అణు సామర్థ్య విశ్వనీయతను రుజువు చేసిందని వెల్లడించింది.
కాగా, శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌కు చెందిన సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సముద్ర జలల కింది నుంచి కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని ఈ ప్రయోగం ద్వారా భారత్ సాధించింది. అలాగే దేశీయంగా నిర్మించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ల పూర్తి సంసిద్ధత, కార్యాచరణను ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించారు.
బాలిస్టిక్ క్షిపణి ఆయుధాలతో కూడిన అణుశక్తి సబ్మెరైన్లు కలిగిన దేశాల్లో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా సరసన భారత్ చోటు దక్కించుకుంది. అయితే అణు క్షిపణులను తొలుత ప్రయోగించబోమన్న నిబద్ధతకు భారత్ కట్టుబడి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

