బోర్డర్లో గ్రామాలను నిర్మిస్తున్న చైనా: ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్

రూపా: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా ఆర్మీ గ్రామాలను నిర్మిస్తున్నట్లు భారత ఆర్మీ పేర్కొన్నది. ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే దీనిపై ఇవాళ కొన్ని అంశాలు వెల్లడించారు. ఎల్ఏసీ వెంబడి ఉన్న కీలక, సమస్యాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ తన కార్యకలాపాలను పెంచినట్లు ఆయన తెలిపారు. ఆ ప్రాంతాల్లో వార్షిక సైనిక చర్యలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపడుతోందని, కీలక ప్రదేశాల్లో కార్యకలాపాల ఉదృతి పెరిగిందని, శిక్షణ పొందుతున్న ప్రదేశాల్లో ఇంకా పీఎల్ఏ దళాలు ఉన్నాయని, అందువల్లే వాస్తవాధీన రేఖతో పాటు డెప్త్ ఏరియాల్లో నిఘాను పెంచినట్లు లెఫ్టినెంట్ జనరల్ పాండే తెలిపారు.
రెండు దేశాలకు చెందిన దళాలు.. వాస్తవాధీన రేఖ వెంట మౌళికసదుపాయాలను పెంచుకుంటున్నట్లు ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ వెల్లడించారు. పీఎల్ఏ వ్యూహాత్మక మోడల్ ప్రకారం.. బోర్డర్ వెంట వాళ్లు గ్రామాలను నిర్మిస్తున్నారని, అయితే అది ఆందోళనకరమైన అంశమని, ఈ విషయాన్ని తమ ప్రణాళికల్లోకి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సరిహద్దుల్లో రక్షణ దళాల సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రతి సెక్టార్లో కావాల్సినంత దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ పాండే చెప్పారు. వీలైనంతవరకు టెక్నాలజీని పెంపొందించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తున్నట్లు ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

