Sonu Sood | నిన్న ఆఫీస్.. ఇవాళ ఇంట్లో ఐటీ సోదాలు
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ( Sonu Sood ) ఇంట్లోనూ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ( Sonu Sood ) ఇంట్లోనూ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి అతని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. గురువారం ఉదయాన్నే ఇంటికి చేరుకున్నారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ సూద్‌కు ఉన్న ప్రాపర్టీ డీల్‌పై పన్ను అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. బుధవారం ఆరు చోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లక్నో రియల్ ఎస్టేట్ కంపనీతో జరిపిన డీల్‌పై అనుమానాలు ఉన్నాయి. ఈ డీల్‌లో పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సర్వే జరపాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఇన్కమ్ ట్యాక్స్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆపరేషన్‌ను సర్వేగా వాళ్లు పిలుస్తున్నారు. అయితే రాజకీయ కక్షతోనే సోనూ సూద్‌పై ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొవిడ్ సందర్భంగా చేసిన దాతృత్వ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా సోనూ పేరు మార్మోగిన విషయం తెలిసిందే. అయితే అతడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి, దేశ్ కా మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే సోనూపై ఇలా ఐటీ దాడుల జరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

