ఢిల్లీలో బీఏ 2.75… మరింతగా వ్యాపించే ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ గుర్తింపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్‌ను దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించారు. వేరియంట్ బీఏ 2.75కు మరింతగా వ్యాపించే గుణం ఉందని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) హాస్పిటల్ వైద్యాధికారులు గురువారం తెలిపారు. ఈ వారంలో 90 మంది కరోనా రోగుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్, విశ్లేషణకు పంపినట్లు చెప్పారు. ఇందులో సగానికిపైగా నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75ను గుర్తించినట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ గత వేరియంట్ కంటే ఇది మరింతగా వ్యాపిస్తుందని వివరించారు. అయితే అనారోగ్యం తీవ్రత తక్కువగానే ఉన్నదని, ఐదు నుంచి వారం రోజుల్లోనే రోగులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
మరోవైపు, ఢిల్లీలో గత 24 గంటల్లో 2,146 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 8 మంది మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఇదే గరిష్ఠ సంఖ్య. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నారు. అయితే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే వారికి ఇది వర్తించదని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

