Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన.. వర్చువల్ కోర్టులో పోర్న్ వీడియోలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. వర్చువల్‌గా వాదనలు జరుగుతున్న సమయంలో.. అకస్మాత్తుగా పోర్న్ వీడియో ప్లే అయ్యింది. చీఫ్ జస్టిస్ కోర్టురూమ్‌లోనే ఈ ఘటన చోటుచేసుకున్నది. రెండుసార్లు ఆ వీడియో ప్లే అయినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. వర్చువల్‌గా వాదనలు జరుగుతున్న సమయంలో.. అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్లే అయ్యింది. చీఫ్ జస్టిస్ కోర్టురూమ్‌లోనే ఈ ఘటన చోటుచేసుకున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ మధ్యలో పోర్న్ వీడియో ప్లే అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల కోర్టు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వర్చువల్ కోర్టు వాదనలను నిలిపివేశారు.
వర్చువల్ హియరింగ్ జరుగుతున్న సమయంలో రెండు సార్లు ఈ సమస్య ఎదురైనట్లు తెలిసింది. రెండు సార్లు అభ్యంతరకర పోర్న్ కాంటెంట్ ప్లే అయినట్లు చెప్పారు. అయితే వర్చువల్ ప్రోసీడింగ్స్‌ను కొనసాగించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్‌ను షట్‌డౌన్ చేసి మళ్లీ స్టార్ట్ ఛేశారు.తొలిసారి సమస్య రాగానే సిస్టమ్‌ను రీస్టార్ట్ చేశారు. కాసేపు బాగానే వీడియో కాన్ఫరెన్స్ వాదనలు జరిగాయి. అయితే మళ్లీ పోర్న్ ప్లే కావడంతో వీసీ సిస్టమ్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేశారు.
పోర్న్ వీడియో ప్లే అవుతున్న సమయంలో మీ సిస్టమ్ హ్యాక్ అయినట్లు మెసేజ్ కూడా వచ్చింది. అయితే హ్యాక్ అయిన విషయాన్ని ఆటోమెటిక్ వాయిస్ ద్వారా కూడా వినిపించినట్లు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌లో సైబర్ అటాక్ జరిగినట్లు పుకార్లు వ్యాపించాయి. నిందిత వ్యక్తి వీసీ స్క్రీన్‌ను షేర్ చేసుకుని, పోర్న్ వీడియోలు ప్లే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ సర్నాబాత్, షిట్జీత్ సింగ్ అకౌంట్ల నుంచి ఆ వీడియోలు ప్లే అయినట్లు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

