Harish Rawat: కాంగ్రెస్‌లో హైకమాండ్‌దే తుది నిర్ణయం
Harish Rawat: కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని, పంజాబ్‌లో పార్టీ ఇన్చార్జిగా పార్టీ ఎప్పటివరకు కొనసాగమంటే అప్పటివరకు కొనసాగుతానని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని, పంజాబ్‌లో పార్టీ ఇన్చార్జిగా పార్టీ ఎప్పటివరకు కొనసాగమంటే అప్పటివరకు కొనసాగుతానని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ చెప్పారు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ మధ్య వివాదం నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కొనసాగుతారా..? లేక తప్పుకుంటారా..? అని మీడియా ప్రశ్నించడంతో రావత్ పై విధంగా స్పందించారు.
అంతేగాక, మరో ఒకటి రెండు రోజుల్లో తాను పంజాబ్‌కు వెళ్తున్నానని, అక్కడ అమరీందర్‌సింగ్‌ను, సిద్ధూను కలిసి మాట్లాడుతానని హరీష్ రావత్ చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అమరీందర్, సిద్ధూ వివాదంపై మాట్లాడేందుకు హరీష్ రావత్ ఈ ఉదయం ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసానికి వచ్చారు. రాహుల్‌తో మాట్లాడి బయటికి రాగానే మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. రాహుల్‌తో భేటీ గురించి ప్రశ్నించగా.. పంజాబ్ పరిస్థితిపైనే చర్చించామని అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

