Parliamentary Team | త్రిపురలో ఎన్నికల అనంతరం హింస.. విచారణకు వెళ్లిన పార్లమెంటరీ బృందంపై దాడి
Parliamentary Team | త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు పార్లమెంటరీ బృంద సభ్యులను అడ్డుకున్నారు. వారు ప్రయాణించిన వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
అగర్తల: బీజేపీ పాలిత త్రిపురలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటనలు జరిగాయి. దీనిపై విచారణ కోసం త్రిపురకు వెళ్లిన పార్లమెంటరీ బృందం (Parliamentary Team) పై శుక్రవారం దాడి జరిగింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పార్లమెంటరీ బృందం సభ్యులు త్రిపుర చేరుకున్నారు. నలుగురు లోక్సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలతో కూడిన పార్లమెంటరీ బృందం సభ్యులు మూడు గ్రూపులుగా విడిపోయారు. స్థానిక కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు పీఆర్ నటరాజన్, రంజితా రంజన్, ఏఏ రహీమ్, అబ్దుల్ ఖలిక్, బికాష్ రంజన్ భట్టాచార్య, వినయ్ విశ్వం, ఇలారామ్ కరీమ్ ఈ బృందం వెంట ఉన్నారు. హింసాత్మక సంఘటనలు జరిగిన పశ్చిమ త్రిపురలోని సెపాహిజాల, గోమతి జిల్లాల్లో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
కాగా, త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు పార్లమెంటరీ బృంద సభ్యులను అడ్డుకున్నారు. సెపాహిజాలా జిల్లాలోని బిషాల్ఘర్కు శుక్రవారం సాయంత్రం వెళ్లిన ఒక బృందాన్ని నేహాల్ చంద్ర నగర్ వద్ద బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వారు ప్రయాణించిన వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో బృందంలోని పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు ఈ దాడి నుంచి అతి కష్టం మీద తప్పించుకున్నారు. ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో కేవలం వాహనాలు మాత్రమే ధ్వంసమయ్యాయని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మిగతా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మరోవైపు పశ్చిమ త్రిపురలోని మోహన్పూర్ను సందర్శించిన పార్లమెంటరీ సభ్యులను కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ దీనిని ఖండించారు. సెక్యూరిటీగా ఉన్న పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. బీజేపీ పురిగొల్చిన హింస విజయం సాధించిందని, దీనిపై అక్కడ విజయోత్సవ ర్యాలీని బీజేపీ నిర్వహిస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
A delegation of Congress leaders was attacked by BJP goons today in Bishalgarh & Mohanpur in Tripura. Police accompanying the delegation did NOTHING. And tomorrow BJP is having a victory rally there. Victory of party-sponsored violence. pic.twitter.com/gZfBm4qEWB
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

