Gen Z paratha | లేస్ పరోటా మేకింగ్ వీడియో వైరల్
viral video : చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్లు నెట్టింట సందడి చేస్తుండగా తాజాగా లేస్ పరాటా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Gen Z paratha : చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్లు నెట్టింట సందడి చేస్తుండగా తాజాగా లేస్ పరాటా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫుడ్ వ్లాగర్లే కాకుండా వీధి వ్యాపారులు సైతం ఈ వెరైటీ ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేస్తుండటంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్గా లేస్ పరాటా ఇన్‌స్టాగ్రాంను హోరెత్తిస్తోంది. ఫుడీజంగ్లీ ఇన్‌స్టా రీల్లో ఓ వీధి వ్యాపారి చిప్స్ పరాటాను తయారుచేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ క్లిప్‌లో అతడు ఓ బౌల్లో రెండు పొటాటో చిప్స్ ప్యాకెట్స్‌ను ఖాళీ చేయడం కనిపిస్తుంది. ఆపై చిప్స్‌ను క్రష్ చేసి ఆనియన్స్, కొత్తిమీరా, మసాలాలతో మిక్స్ చేస్తాడు. మిక్చ్సర్ సిద్ధం కాగానే వాటిని పిండిలో కలిపి రోల్స్‌గా చేసి ఆపై పరోటాలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకూ కుక్ చేసి బటర్‌తో వాటిని సర్వ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఈ వైరల్ రీల్‌ను ఇప్పటివరకూ 30 లక్షల మందికిపైగా వీక్షించగా ఈ పరాటా ఐడియాతో పలువురు విభేదించారు. అసలు ఈ పరోటా అవసరమా అని నెటిజన్లు ప్రశ్నించారు. ఇక నుంచి పరాటాను క్రష్ చేసి దానిలో మోమోస్‌ను స్టఫ్ చేస్తారని ఓ యూజర్ కామెంట్ చేశారు. దీని కంటే ఆలూ పరాటా మేలు కదా అని ఓ యూజర్ ప్రశ్నించగా, జెన్ జడ్ పరోటా అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Donald Trump | నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయిన ట్రంప్.. ఇది నాలుగోసారి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
Telangana Urban Projects | తెలంగాణలో ఐదు పట్టణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. రూ.873 కోట్లు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

