న్యూయార్క్ : అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇన్ అండ్ అవుట్ రెస్టారెంట్లోకి ఓ వ్యక్తి ఏకంగా తన ఒంటెతో నడుచుకుంటూ వచ్చి ఆర్డర్ తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తి వెంట భారీ జంతువు రెస్టారెంట్లోకి రావడం చూసి అక్కడున్న వారితో పాటు రెస్టారెంట్ సిబ్బంది విస్తుపోయారు.
అక్టోబర్ 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెవాడాకు చెందిన బ్రాండన్ నోబుల్స్ ఫెర్గీ అనే ఒంటెను వెంటబెట్టుకుని రెస్టారెంట్లోకి వచ్చిన వీడియోను నౌ దిస్ న్యూస్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
12 ఏండ్ల వయసున్న ఫెర్గీకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమని వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. లాస్ వెగాస్‌లో ఏదైనా సాధ్యమేనని ఓ వ్యక్తి కామెంట్ చేయగా ఇది జీవ హింస కిందకు వస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.