viral video | పెద్దాయనకు బాలిక చిరుసాయం : చిన్నారి ఔదార్యానికి నెటిజన్లు ఫిదా
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలవుతున్నా కొన్ని వీడియోలు (viral video) మాత్రం గుండెలను తాకుతుంటే మరికొన్ని ఉద్వేగంతో కంటనీరు తెప్పిస్తుంటాయి.
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలవుతున్నా కొన్ని వీడియోలు (viral video) మాత్రం గుండెలను తాకుతుంటే మరికొన్ని ఉద్వేగంతో కంటనీరు తెప్పిస్తుంటాయి. తాజాగా భావోద్వేగాలను రేకెత్తించే ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది. పెద్దాయన బాటిల్ నుంచి నీరు తాగేందుకు ఓ చిన్నారి సాయం చేస్తున్న వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్మెంట్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ఈ వైరల్ క్లిప్‌ను ఏకంగా 15 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన కూర్చున్న ఓ పెద్దాయన బాటిల్ నుంచి నీరు తాగేందుకు ఇబ్బంది పడుతుంటాడు. అతడి చేయి వణుకుతుండటంతో బాటిల్‌ను పైకి లేపి నీరు తాగేందుకు ఆయనకు చేతకాకపోవడం కనిపిస్తుంది.
పెద్దాయన ఇబ్బందిన గమనించిన బాలిక అతడికి బాటిల్ నుంచి నీరు తాగేందుకు సహకరిస్తుంది. బాలిక పెద్దాయన వీపుపై ఒక చేయి వేసి మరో చేతితో బాటిల్ పట్టుకుని ఆయనతో నీరు తాగించడం ఈ వీడియోలో చూడొచ్చు. బాలిక ఔదార్యానికి నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఈ చిన్నారి దయా గుణం, ఇతరుల పట్ల చూపే సహానుభూతి గొప్పవని కామెంట్స్ సెక్షన్లో యూజర్లు రాసుకొచ్చారు.
Read More
Girl Swallows Phone | సోదరుడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

