న్యూఢిల్లీ : కొందరు వయసు మీదపడినా ఉరకలెత్తే ఉత్సాహంతో ఎందులో తగ్గేదేలేదని సత్తా చాటుతుంటారు. శారీరక, మానసిక సామర్ధ్యం తమలో ఏమాత్రం సడలలేదని తమకు వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమేనంటారు. తాజా వీడియోలో ఓ వృద్ధుడు సైకిల్‌పై వెళుతూ చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
Enjoy every moment ❤️ pic.twitter.com/sOujOxmEfD
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 29, 2022
ట్విట్టర్లో ఈ వీడియో షేర్ చేయగా ఇప్పటివరకూ 50000కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో వృద్ధుడు సైకిల్‌పై వెళుతూ స్టంట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నాడు. అదే రోడ్డులో ప్రయాణిస్తున్న ఒకరు ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టు కనిపిస్తోంది.
ఈ వీడియోను చూసి వృద్ధుడి జోష్‌పై అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆయనకు వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఓ యూజర్ వ్యాఖ్యానించగా, జీవితం అందమైనదని ఓ యూజర్ రాసుకురాగా, మరొకరు జీవితంలో ఆనందం ఇదేనని కామెంట్ చేశారు.