లక్నో: ఒక వ్యక్తి డేరింగ్ స్టంట్ చేశాడు. పెద్ద మొసలిని గమనించిన అతడు ఒక్కడే దానిని పట్టుకున్నాడు. బంధించిన తర్వాత భుజంపై మోసుకెళ్లి కాలువలో వదిలేశాడు. (Man Carries Crocodile) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామంలోని కాలువలో పెద్ద మొసలి కనిపించింది. దానిని చూసి స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఒక వ్యక్తి ఎలాంటి భయం లేకుండా ఒంటరిగా ఆ మొసలిని పట్టుకుని బంధించాడు. ఆ తర్వాత తన భుజంపై వేసుకున్నాడు. సమీపంలో ఉన్న నది వరకు దానిని మోసుకెళ్లాడు. ఆ భారీ మొసలిని ఆ నదిలో విడిచిపెట్టాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వ్యక్తి డేరింగ్ స్టంట్‌ను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. బాహుబలితో అతడ్ని పోల్చారు. మరి కొందరు మాత్రం అతడి తీరును విమర్శించారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి సహాయంతో ఆ మొసలిని పట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి సాహసాలు ఒక్కోసారి ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరించారు.
ललितपुर-युवक ने नाले से एक मगरमच्छ को पकड़कर और अपने कंधे पर लेकर जंगल में छोड़ने के लिए उसे निकल गया..वीडियो तेजी से वायरल हो रहा है..@ForestPolice pic.twitter.com/VJ31SAEiB7
— Vinit Tyagi (@tyagivinit7) October 21, 2023