కీలక మంత్రులకు ఉద్వాసన

- హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్, పోఖ్రియాల్, రవిశంకర్ రిజైన్
- మొత్తం 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామా
- ఆరుగురు క్యాబినెట్, ఆరుగురు సహాయ మంత్రులు
న్యూఢిల్లీ, జూలై 7: కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ముందుగానే ఊహించినప్పటికీ.. సీనియర్ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్, రమేశ్ పోఖ్రియాల్ రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నలుగురు సహా మొత్తం 12 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంటనే ఆమోదించారు. రాజీనామా చేసినవారిలో ఆరుగురు క్యాబినెట్ మంత్రులు, ఆరుగురు సహాయ మంత్రులు ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఊహించడంలో, కట్టడికి చర్యలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలం అయిందని జాతీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకొన్నది. మరోవైపు, కొత్త ఐటీ రూల్స్‌తో ట్విట్టర్, కేంద్రప్రభుత్వం మధ్య విభేధాలు కొనసాగుతుండగానే ఆ శాఖ మంత్రి మార్పు జరుగడం విశేషం. ఇక, ఓటీటీలు, డిజిటల్ మీడియాపై ఆంక్షలు తదితర కీలక నిర్ణయాల్లో భాగస్వామి అయిన సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కూడా ఆ శాఖ నుంచి తప్పించారు. కేంద్రవిద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ హయాంలో నూతన విద్యావిధానానికి రూపకల్పన జరగ్గా ప్రస్తుతం ఆ శాఖ నుంచి ఆయనను తప్పించారు.
మంత్రిపదవికి రాజీనామా చేసినవారు
- రవిశంకర్ ప్రసాద్-ఐటీ, న్యాయశాఖ మంత్రి
- ప్రకాశ్ జవదేకర్-పర్యావరణ, సమాచారశాఖ
- హర్షవర్ధన్-ఆరోగ్యశాఖ మంత్రి
- రమేశ్ పోఖ్రియాల్-విద్యాశాఖ మంత్రి
- సదానంద గౌడ- ఎరువులు, రసాయనాల శాఖ
- సంతోష్ గంగ్వార్-కార్మికశాఖ మంత్రి
- సంజయ్ ధోత్రే-విద్యాశాఖ సహాయ మంత్రి
- దేబశ్రీ-శిశు, మహిళాభివృద్ధిశాఖ సహాయ మంత్రి
- కటారియా-జలశక్తిశాఖ సహాయ మంత్రి
- సుప్రియో-పర్యావరణశాఖ సహాయ మంత్రి
- థావర్‌చంద్ గెహ్లాట్-సామాజిక న్యాయశాఖ
- ప్రతాప్‌చంద్ర సారంగి-ఎంఎస్ఎంఈ శాఖ
వైఫల్యాన్ని కేంద్రం ఒప్పుకొన్నది: చిదంబరం
న్యూఢిల్లీ: తాము కరోనాను నియంత్రించలేకపోయామని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ రాజీనామా ద్వారా కేంద్రం స్పష్టంగా ఒప్పుకొన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. ఘనతలను ప్రధాని మోదీ తన ఖాతాలో వేసుకొంటారని, వైఫల్యాలను మంత్రుల మీదకు తోసేస్తారని అన్నారు. ‘హర్షవర్ధన్ బలిపశువు’ అని మరో సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

