గుజరాత్లో వెయ్యి కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు రట్టు చేశారు. రూ.1,026 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ సరఫరాదారుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ సందర్భంగా గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది
- 513 కిలోల మెఫెడ్రోన్ పట్టివేత
ముంబై, ఆగస్టు 16: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు రట్టు చేశారు. రూ.1,026 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ సరఫరాదారుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ సందర్భంగా గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో ముంబై పోలీసులు గుజరాత్‌లోని అంకలేశ్వర్ ప్రాంతానికి వెళ్లారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడి నుంచి ముంబై సహా ఇతర ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నట్టు వివరాలు సేకరించారు.
ఫ్యాక్టరీలో సోదాలు జరిపి దాదాపు రూ.1,026 కోట్ల విలువైన 513 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమాని గిరిరాజ్ దీక్షిత్‌ను అరెస్టు చేశారు. ఇతడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాడు. పోలీసులు మాట్లాడుతూ ‘భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించాం. గుజరాత్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా పనిచేస్తున్నట్టు మాకు మొదటి నుంచి అనుమానం ఉన్నది. ఆ రాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే ముంబైలో పట్టుబడిన పలువురు డ్రగ్స్ సరఫరాదారులు గుజరాత్ పేరునే ప్రస్తావించారు. ఈక్రమంలోనే భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించాం. ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gujarat
- illegal drugs
- Seized
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

