కాన్పూర్, మే 28: అంధుల కోసం ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ఓ స్మార్ట్ వాచ్ను తయారు చేశారు. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయి, గుండె వేగం, నడిచే దూరం.. వీటన్నింటిని తెలియజేస్తుంది. గుండె వేగం పెరిగినప్పుడు, ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు వైబ్రేషన్ ద్వారా హెచ్చరించడం దీని ప్రత్యేకత.
అంతే కాకుండా వాచ్లో వివిధ రకాల యాప్లు ఓపెన్ చేయడానికి, సమయం తెలుసుకోవడానికి భిన్నమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అంధులు తమ రోజువారీ కార్యకలాపాలు సులువుగా చేయడానికి ఈ వాచ్ దోహదం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.