న్యూఢిల్లీ, నవంబర్ 23: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ఐఐటీ ఢిల్లీ మాత్రమే టాప్-50లో చోటు దక్కించుకున్నది.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 58వ స్థానంలో నిలువగా, ఐఐటీ బాంబే 72వ స్థానంలో నిలిచింది. టాప్-200లో ఐదు భారత విద్యాసంస్థలకు చోటు లభించింది. ఐఐటీ అహ్మదాబాద్ 154, ఐఐటీ ఖరగ్పూర్ 155వ స్థానాల్లో నిలిచాయి.