న్యూఢిల్లీ, మార్చి 22: నికోటిన్ వాడకాన్ని తగ్గించేందుకు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి ప్రతీక్శర్మ అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. నికోటిన్, తారును 80శాతం వరకూ అడ్డుకొంటూ టేస్ట్‌లో ఎలాంటి మార్పులేని ఫిల్టర్ సిగరెట్‌ను తయారు చేశాడు. 2018లో హీరో అక్షయ్‌కుమార్ నటించిన ఓ సిగరెట్ యాడ్ ప్రేరణతో ఐదేండ్లు శ్రమించి దీన్ని రూపొందించాడు. ‘సిగిబడ్’గా పిలుస్తున్న ఈ ఫిల్టర్ సిగరెట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇది ధూమపానం అలవాటును మూడు నెలల్లో మానేలా చేస్తుందని శర్మ తెలిపారు.