Smoking | స్మోకింగ్ మధ్యలో మానేయడంతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలిసినా దాన్ని మానేయటానికి చాలా మంది ఆసక్తి చూపించరు. స్మోకింగ్‌ను మధ్యలో మానేయటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.
Smoking | న్యూఢిల్లీ: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలిసినా దాన్ని మానేయటానికి చాలా మంది ఆసక్తి చూపించరు. స్మోకింగ్‌ను మధ్యలో మానేయటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఏ వయస్సులోనైనా పొగ తాగడాన్ని మానేయటం వల్ల మరణించే ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది. మూడు సంవత్సరాల పాటు స్మోకింగ్ చేయకుండా ఉంటే వారి ఆయుర్దాయం రెట్టింపు అవుతుందట.
40 ఏండ్లలోపు పొగ తాగడాన్ని మానేస్తే.. వారు స్మోకర్లు కానేకారని అధ్యయనకారులు తెలిపారు. సాధారణ మనుషుల్లాగే వారూ జీవించవచ్చని ఇటీవల వెలువడిన ఓ నివేదకలో పేర్కొన్నారు. టొరంటో విశ్వవిద్యాలయం డల్లాలానా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ప్రభాత్ ఝా ఈ పరిశోధనలపై వ్యాఖ్యానిస్తూ ధూమపానం మానేయటమన్నది లైఫ్ రిస్క్‌ను నిస్సందేహంగా తగ్గిస్తుందన్నారు.
యూఎస్, యూకే, కెనడా, నార్వేలలో 1.5 మిలియన్ల మందిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసింది. స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే 40 నుంచి 79 సంవత్సరాల వయస్సు గల స్మోకర్లు చనిపోయే ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. ధూమపానం వల్ల సగటున 12 నుంచి 13 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతున్నారు. అయితే కొంతకాలం స్మోకింగ్ చేసి మానేసిన వారికి చనిపోయే ప్రమాదం 1.3 రెట్లు తగ్గిందని కనుగొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

