Indian Airforce | ఎయిర్‌ఫోర్స్ జవాన్లకు కొత్త యూనిఫాం.. తొలిసారి ఢిల్లీ ఆవల రైజింగ్ డే
Indian Airforce | భారత వాయుసేన జవాన్లు ఇకపై కొత్త డ్రెస్‌లో కనిపించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రైజింగ్ డే సందర్భంగా చండీగఢ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ కొత్త డ్రెస్‌ను విడుదల చేశారు. అన్ని వాతావారణాలను తట్టుకుని నిలబడేలా..
Indian Airforce | భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకత. ఈ యూనిఫాంను ఎయిర్ ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంయుక్తంగా రూపొందించాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 90 వ రైజింగ్ డే రోజున ఈ మార్పును తీసుకొచ్చారు. ఢిల్లీ ఆవల తొలిసారి ఐఏఎఫ్ రైజింగ్ డే ఉత్సవాలు జరిగాయి. చండీగఢ్‌లో జరిపిన ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఎయిర్‌చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరీ హాజరయ్యారు. ఇదే సందర్భంలో వెపన్ సిస్టమ్ బ్రాంచ్ కూడా ఏర్పాటైంది.
భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సైనికుల కోసం ప్రభుత్వం శనివారం కొత్త యూనిఫాంను విడుదల చేసింది. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా వైమానిక దళానికి కొత్త కార్యాచరణ శాఖ.. వెపన్ సిస్టమ్ బ్రాంచ్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు ఎయిర్ చీఫ్ వీఆర్ చౌదరి తెలిపారు. ఈ కొత్త యూనిఫాం సైన్యం యూనిఫారాన్ని పోలి ఉంటుంది. వైమానిక దళం థీమ్ ఈసారి ‘ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్’ అని తయారుచేశారు.
యూనిఫాం డిజిటల్ నమూనా ఎడారి, పర్వత భూమి, అడవి వంటి ప్రదేశాల్లో సైనికులు తమ విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యూనిఫాంను తేలికపాటి ఫాబ్రిక్, డిజైన్‌తో తయారు చేశారు. కొత్త కంబాట్ యూనిఫామ్‌లో కంబాట్ టీ-షర్ట్, ఫీల్డ్ స్కేల్ డిస్రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్ట్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్లెట్ కంబాట్ బూట్లు, మ్యాచింగ్ టర్బన్ ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

