మోదీ, అమిత్ షా నాకు నాయకులు: పంకజ ముండే
Pankaja Munde: బీజేపీలో తాను జాతీయ స్థాయి నాయకురాలినని, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు నాయకులని

ముంబై: బీజేపీలో తాను జాతీయ స్థాయి నాయకురాలినని, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు నాయకులని దివంగత గోపినాథ్ ముండే పెద్ద కుమార్తె, బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ పంకజ ముండే చెప్పారు. ఇటీవల జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కనందుకు తన అనుచరులు చాలా మంది పార్టీ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారని ఆమె తెలిపారు.
తన తండ్రి గోపినాథ్ ముండే ఎప్పుడైనా సమాజంలో అట్టడుగు వర్గాల వారికే ఉన్నత పదవులు కట్టబెట్టేవారని పంకజ ముండే గుర్తుచేసుకున్నారు. ఆయన తననుగానీ, తన సోదరి ప్రీతమ్ ముండేనుగానీ మంత్రి పదవుల కోసం రాజకీయాల్లోకి తీసుకురాలేదని చెప్పారు. తన తండ్రి మరణానంతరం మహారాష్ట్ర బీజేపీ తనకు మంత్రి పదవి ఆఫర్ చేసిందని, కానీ తాను తిరస్కరించానని పంకజ ముండే తెలిపారు.
తన సోదరి ప్రీతమ్ ముండేకుగానీ, తనకుగానీ మంత్రి పదవుల మీద మోజు లేదని ఆమ పంకజ ముండే చెప్పారు. తన కోసం పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ తన అనుచరులందరినీ వారించానని, తన కోసం ఎవరూ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పానని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో తానేమీ ధర్మ యుద్ధం చేయాలనుకోవడం లేదని, మాజీ సామాజిక వర్గం ఒకరికి మంత్రివర్గంలో చోటుదక్కిందని, అంతే చాలని ఆమె వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

