‘అలా అయితే నేను నియంతలా మారతా’… తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరిక
చెన్నై: తన పాలనలో అవినీతి, అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. అవి పెరిగితే తాను నియంతలా మారతానని వార్నింగ్ ఇచ్చారు. నమక్కల్‌లో సోమవారం జరిగిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి సీఎం స్టాలిన్ మాట్లాడారు. ‘నేను చాలా ప్రజాస్వామ్యంగా మారానని నా సన్నిహితులు అంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే అందరి అభిప్రాయాలు వినడం, గౌరవించడం. ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా ఏమైనా చేయడం అని కాదు. నేను అలా మారలేదు. కానీ క్రమశిక్షణా రాహిత్యం, అకృత్యాలు పెరిగితే నేను నియంతగా మారి చర్యలు తీసుకుంటా. ఈ విషయాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే కాదు అందరికి చెబుతున్నా’ అని అన్నారు.
కాగా, ప్రజల కోసం చట్టం ప్రకారం నడుచుకోవాలని ప్రజా ప్రతినిధులకు సీఎం స్టాలిన్ సూచించారు. చట్టాన్ని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అలాగే తమ బాధ్యతలను భర్తలకు అప్పగించవద్దని మహిళా ప్రతినిధులకు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

