Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
Supreme Court: ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. పంట వ్యర్ధాలను సేకరించే విధానాన్ని, ధరను ముందే ప్రకటించాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ వ్యవస్థను రూపొందించాలన్నది. బహుశా ఢిల్లీ వెదర్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటానని సీజేఐ ఓ కేసు వాదన సమయంలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో నెలకొన్న వాయు కాలుష్య సంక్షోభంపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు జరిగాయి. పంట వ్యర్ధాలను సేకరించే విధానాన్ని, ధరను ముందే ప్రకటించాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ వ్యవస్థను రూపొందించాలని పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విన్నది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేస్తున్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ .. బహుశా ఢిల్లీ వెదర్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటానని అన్నారు. అయితే బెంచ్ ముందు సీనియర్ లాయర్ అపరాజిత సింగ్ రియాక్ట్ అవుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉందన్నారు. తన గొంతుపై ఆ ప్రభావం ఉన్నట్లు ఆమె చెప్పారు.
ఈ ప్రాంతంలో గాలి పీల్చడం అంటే రోజుకు 30 సిగరెట్లు తాగినదానితో సమానం అవుతుందని ఆమె అన్నారు. వర్షం వల్ల కూడా కాలుష్యం కాస్త తగ్గినట్లు చెప్పారు. వచ్చే సీజన్ కోసం రైతులు ప్రిపేర్ కావడం వల్ల పంట వ్యర్ధాలను కాల్చడం కూడా ఆగినట్లు తెలుస్తోందని సుప్రీం తెలిపింది. అయితే ఢిల్లీ కాలుష్యంలో 14 శాతం పంటలు కాల్చడం వల్లే వస్తుందని సింగ్ తెలిపారు. ఢిల్లీ ఇప్పటికే తీవ్రమైన కాలుష్యంతో నిండి ఉన్నదని, దీనికి తోడు పంట వ్యర్ధాలు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిలం అవుతోందన్నారు. పంట వ్యర్ధాలను సేకరించేందుకు ఓ వ్యవస్థను రూపొందించామని, మరి వాహనాలు, హైఎండ్ కార్ల సంగతి ఏంటని సుప్రీంకోర్టు అడిగింది.
ట్రాన్స్‌పోర్టేషన్ వల్లే ఢిల్లీలో అధిక కాలుష్యం నమోదు అవుతోందని సింగ్ తెలిపారు. వెహికల్ పొలుషన్ పెద్ద సమస్యగా మారిందని, రోడ్లపై ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ఉందని సీజే సూర్యకాంత్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

