నెలకు 5 లక్షల జీతం.. 2.75 లక్షల ట్యాక్స్ కడుతున్నా: రాష్ట్రపతి రామ్‌నాథ్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని తన సొంతూరికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రైలులో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను కూడా ఆదాయపన్ను కడుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి కోసం రెగ్యులర్‌గా పన్నులు చెల్లించాలన్నారు. నెలలో తాను ఆదా చేసుకున్న దాని కన్నా ఎక్కువే కొందరు సంపాదిస్తున్నట్లు కూడా చెప్పారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రత్యేక రైలులో యూపీ వెళ్లిన రాష్ట్రపతి కోవింద్.. స్వగ్రామం పరౌంక్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలంతా కర్తవ్యదీక్షతో పన్నులు చెల్లించాలన్నారు. పలానా రైల్వే స్టేషన్లో రైలు ఆగడం లేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు, కొన్ని సందర్భాల్లో కొందరు ఆ రైలును ధ్వంసం చేస్తారు, కొందరు రైళ్లకు నిప్పు అంటిస్తుంటారు, రైలు దగ్ధం అయితే అప్పుడు నష్టం ఎవరికి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాపర్టీ నష్టమైందన్న వాదన ప్రజలు వినిపిస్తుంటారని, కానీ అది ప్రజల పన్ను అని కోవింద్ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో అత్యధిక జీతం అందుకుంటున్న వ్యక్తి రాష్ట్రపతి అని అందరికీ తెలుసు అని, ప్రతి నెలా రూ.2.75 లక్షలు నెలకు ట్యాక్స్ కడుతున్నానన్నారు. ప్రతి నెలా 5 లక్షల జీతం వస్తుందని అందరూ అంటుంటారని, కానీ దానికి కూడా ట్యాక్స్ ఉంటుందని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రపతి కోవింద్ తాను ట్యాక్స్ కడుతున్నట్లు చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలంతా చప్పట్లు కొట్టారు. తాను ఆదా చేసిన దాని కన్నా.. అధికారులు ఎక్కువ సంపాదిస్తారని, ఇక్కడ ఉన్న టీచర్లు అంత కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. పన్నులు చెల్లించడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని చెప్పేందుకు తాను ఇలా మాట్లాడుతున్నట్లు రామ్‌నాథ్ తెలిపారు. సాధారణ పల్లె పౌరుడు ఇలా దేశ అత్యున్నత పదవిని అలకరిస్తారని తానెప్పుడు అనుకోలేదని, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

