Vijay’s father : తమిళనాడు (Tamil Nadu) లో విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) ఘన విజయం సాధించడంపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ (SA Chandrashaker) సంతోషం వ్యక్తంచేశారు. ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. విజయ్‌కు అతడిపై ఉన్న విశ్వాసం అద్భుతమని కొనియాడారు. ఆ నమ్మకమే అతడిని సీఎం కుర్చీకి చేరువ చేసిందని వ్యాఖ్యానించారు. విజయ్ యాటిట్యూడ్‌ను తాను అభినందిస్తున్నానని అన్నారు. ఎవరితోనూ పొత్తుల్లేకుండా ఒంటిరిగా నిలబడి.. పార్టీని నిలబెట్టాడని ప్రశంసించారు. ఇది విజయ్‌కి మాత్రమే గొప్ప విజయం కాదని, తమిళనాడులోనూ ఇది చారిత్రక విజయమని అన్నారు.
కాగా తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుత ఫలితాలను సాధించింది. మొత్తం 234 నియోజకవర్గాలలో దాదాపు 110 స్థానాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలు చెరో 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దాంతో వరుసగా మూడోసారి గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న డీఎంకే శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి. ఇక అన్నాడీఎంకే కూడా గతంలో కంటే కొన్ని స్థానాలు అధికంగా తన ఖాతాలో చేరే అవకాశం ఉన్నా.. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించలేదనే అసంతృప్తితో ఉన్నది.