MK Stalin | ఆ పేరుకు కళంకం తేవడం నాకు ఇష్టం లేదు : తమిళనాడు సీఎం
MK Stalin | అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఈ అంశాన్ని అడ్డంపెట్టుకుని కొందరు సభ్యులు మాటిమాటికి అన్నా యూనివర్సిటీ పేరు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు.
MK Stalin : అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఈ అంశాన్ని అడ్డంపెట్టుకుని కొందరు సభ్యులు మాటిమాటికి అన్నా యూనివర్సిటీ పేరు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు. యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన దారుణం ఎవరికీ ఆమోదయోగ్యం కాదని, అది దారుణమని వ్యాఖ్యానించారు.
‘సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు. నేను ఆ పేరుకు కళంకం తేవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ సభలో ఉన్నవారిలో చాలామందిని తయారు చేసింది ఆయనే. ఆ భావోద్వేగంతో నేను ఆ పేరును పక్కన పెడుతున్నా. చెన్నైలో విద్యార్థినిపై జరిగిన ఘటనను ఎవరూ ఆమోదించరు. విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
‘సభలోని సభ్యులంతా లైంగిక దాడి ఘటనపై మాట్లాడారు. ఒక్కరు తప్ప మిగతా అందరూ నిజమైన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని చెడుగా చూపించడమే ఆ ఒక్క సభ్యుడి పని. కానీ నేను ఒక్కటే చెబుతున్నా. మా ప్రభుత్వం బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుంది. నేరం జరిగిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయకపోయినా, అతడిని కాపాడే ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వాన్ని నిందించవచ్చు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసినా, వేగంగా విచారణ చేయిస్తున్నా ప్రభుత్వాన్ని నిందించడమనేది రాజకీయ ప్రయోజనాల కోసమే’ అని స్టాలిన్ ఆరోపించారు.
అన్నా యూనివర్సిటీలో ఇటీవల 19 ఏళ్ల విద్యార్థినిపై గణశేఖరన్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు క్యాంపస్ భవనం వెనుకాల తన స్నేహితుడితో మాట్లాడుతుండగా నిందితుడు చూశాడు. ఆమె స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఘటనపై విద్యార్థిని తన స్నేహితునితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

