Not Domestic Violence | భర్త తన తల్లితో సమయం గడపడం, డబ్బు ఇవ్వడం గృహ హింస కాదు: కోర్టు
Not Domestic Violence | భర్త తన తల్లితో సమయం గడపడం, ఆమెకు డబ్బు ఇవ్వడం గృహ హింస కాదని సెషన్స్ కోర్టు పేర్కొంది. (Not Domestic Violence) దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
ముంబై: భర్త తన తల్లితో సమయం గడపడం, ఆమెకు డబ్బు ఇవ్వడం గృహ హింస కాదని సెషన్స్ కోర్టు పేర్కొంది. (Not Domestic Violence) దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ తన భర్త, అత్తింటి వారిపై గృహ హింస కింద కోర్టును ఆశ్రయించింది. తల్లి మానసిక రోగాన్ని దాచి తన భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తాను ఉద్యోగం చేయడాన్ని అత్త వ్యతిరేకించిందని, భర్త, ఆమె తల్లి కలిసి తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది.
తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబరు 2004 వరకు ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, సెలవుపై భారత్‌కు వచ్చినప్పుడు తల్లిని కలిసేవాడని, ఆమెకు ప్రతి ఏటా రూ.10,000 పంపేవాడని ఆ మహిళ ఆరోపించింది. తల్లి కంటి ఆపరేషన్ కోసం కూడా డబ్బు ఖర్చు చేశాడని పేర్కొంది. అత్తంటి కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద రక్షణ, ఉపశమనం, కల్పించడంతోపాటు పరిహారం ఇప్పించాలని మేజిస్ట్రేట్ కోర్టును కోరింది.
కాగా, భార్య తనను భర్తగా ఎన్నడూ అంగీకరించలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసేదని ఆ వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఆమె క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాడు. అలాగే తనకు చెప్పకుండా తన ఎన్ఆర్ఈ ఖాతా నుంచి రూ. 21.68 లక్షలు విత్‌డ్రా చేసిందని, ఆ డబ్బుతో ఫ్లాట్ కొనుగోలు చేసిందని ఆమె భర్త ఆరోపించాడు.
మరోవైపు ఆ మహిళ అభ్యర్థనపై విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ. 3,000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది. అయితే పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత గృహ హింస కింద ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలాగే మధ్యంతర భరణాన్ని రద్దు చేసింది. దీంతో ఆ మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను ముంబైలోని సెషన్స్ కోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన ఆ కోర్టు ఒక వ్యక్తి తన తల్లికి సమయం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించబోమని పేర్కొంది. తగిన ఆధారాలు లేవంటూ ఆ మహిళ పిటిషన్‌ను తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

