అమెరికాలో ఐడా బీభత్సం

- న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఎమర్జెన్సీ
- భారీ వర్షాల కారణంగా 14 మంది మృతి
న్యూయార్క్, సెప్టెంబర్ 2: వరుస తుఫానులతో అమెరికా చిగురుటాకులా వణుకుతున్నది. వారం రోజుల క్రితం సంభవించిన హెన్రీ తుఫాను దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్ విరుచుకుపడింది. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ర్టాల్లో ఐడా తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రాష్ర్టాలు జలమయం అయ్యాయి. 14 మంది చనిపోయారు. రవాణా సేవలను పూర్తిగా నిలిపివేశారు. న్యూయార్క్ నగరంలో ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోగా వీరిలో రెండేండ్ల బాలుడు ఉన్నాడు. ఎడతెరిపి లేని వానలతో న్యూయార్క్, న్యూజెర్సీల్లో రోడ్లు, సబ్వేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ రెండు రాష్ర్టాల్లో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. నేషనల్ వెదర్ సర్వీస్ మొట్ట మొదటి సారి ఆకస్మిక వరద హెచ్చరికలను జారీ చేసింది. న్యూయార్క్లో బుధవారం రాత్రి రికార్డు స్థాయిలో ఒక్క గంటలోనే 9 సెంటీమీటర్ల వాన కురిసింది. తుఫాను క్రమంగా న్యూ ఇంగ్లండ్ వైపు కదులుతున్నది. ఈ క్రమంలో భారీ టోర్నడోలు సంభవించవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆఫ్రికా తీరంలో ఏర్పడిన లారీ తుఫాన్ బలపడి అమెరికా వైపునకు చురుగ్గా కదులుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Hurricane Ida
- Newyork
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

