ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభం: అదార్ పూనావాలా
Adar Poonawala | సెర్వైకల్ క్యాన్సర్ నిరోధం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ సెర్వవాక్ ఉత్పత్తిని
న్యూఢిల్లీ: సెర్వైకల్ క్యాన్సర్ నిరోధం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ సెర్వవాక్ ఉత్పత్తిని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని మొదలుపెట్టడం ఆలస్యమైందని ఆయన శుక్రవారం మీడియాకు తెలిపారు.
సెర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV)ను కట్టడి చేయడంలో ఈ వ్యాక్సిన్ కీలకంగా పనిచేస్తుందని పూనావాలా చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2024లో యూనిసెఫ్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామన్నారు. అక్కడ గత కొన్నేండ్లుగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ లోటు ఉందని చెప్పారు.
సెర్వవాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇప్పటికే లైసెన్స్ ఇచ్చిందని పూనావాలా తెలిపారు. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రతినెల పది లేదా ఇరవై లక్షల డోసులను ప్రభుత్వానికి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ను తక్కువ ధరకే అందిస్తామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కచ్చితమైన ధరను నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

