కన్నవారిని కోల్పోయిన కొన్ని గంటల్లోనే.. విధులకు ఇద్దరు వైద్యులు

అహ్మదాబాద్: కన్నవారిని కోల్పోయిన కొన్ని గంటల్లోనే ఇద్దరు వైద్యులు తమ విధులకు హాజరయ్యారు. బాధను దిగమింగుకుని కరోనా రోగులకు సేవలందించారు. ఈ హృదయవిదారకర ఘటన గుజరాత్లో జరిగింది. వడోదరలోని ఎస్ఎస్జీ ఆసుపత్రిలో డాక్టర్ శిల్పా పటేల్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 3.30 గంటలకు కరోనాతో చికిత్స పొందుతున్న ఆమె 77 ఏండ్ల తల్లి చనిపోయారు. తల్లి మరణాన్ని దిగమింగుకున్న డాక్టర్ శిల్ప, తల్లి అంత్యక్రియల అనంతరం ఆరు గంటల్లో తిరిగి విధుల్లోకి చేరారు. డ్యూటీ కన్నా ఏదీ ముఖ్యం కాదని మరణానికి ముందు తన తల్లి కాంతా అంబలాల్ పటేల్ చెప్పినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
మరోవైపు డాక్టర్ రాహుల్ పర్మార్, గాంధీనగర్‌లో కరోనా మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తల్లి కాంత పర్మార్ గురువారం మరణించారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన డాక్టర్ రాహుల్ శుక్రవారం విధులకు హాజరయ్యారు. తల్లులను కోల్పోయిన ఈ ఇద్దరు డాక్టర్లు ఆ బాధను దిగమింగుకుని కరోనా కష్టకాలంలో రోగుల సేవలకు కొన్ని గంటల్లోనే విధులకు హాజరుకావడం, వత్తిపట్ల వారి అంకిత భావాన్ని సహ వైద్యులు, అధికారులు కొనియాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

