President’s Bodyguard Horse Virat | రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రక్షణలో భాగమైన ‘విరాట్’ అనే గుర్రం నేడు పదవీ విరమణ చేసింది. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఆ గుర్రానికి ఓ అవార్డు కూడా లభించింది. అవార్డు పేరు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ కూడా లభించింది. ఈ రోజు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆ గుర్రానికి ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే వీడ్కోలు పలికే సమయంలో గుర్రాన్ని నిమిరి, దాని తలపై ప్రేమతో నిమరి, రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి వీడ్కోలు పలకడం గమనార్హం. ఇప్పటికి ఈ గుర్రం 13 గణతంత్ర దినోత్సవాల్లో పాలు పంచుకొంది. మాజీ రాష్ట్రపతులు, ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ రక్షణ చర్యల్లో భాగంగా సేవలందించింది.
‘విరాట్’ అనే గుర్రం ఎంతో క్రమశిక్షణతో విధుల్లో పాల్గొంటుందని రక్షణ శాఖ పేర్కొంది. అలాగే అత్యంత విశ్వసనీయతతో ఉంటూ, రాష్ట్రపతి రక్షణ విధుల్లో పాలుపంచుకుంటుందని అధికారులు తెగ మెచ్చుకున్నారు. ఇది హనోవేరియన్ అనే జాతికి చెందిన గుర్రమని, 2003 లో రాష్ట్రపతి రక్షణ విభాగంలో విధుల నిమిత్తమై చేరిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ గుర్రాన్ని రాష్ట్రపతి అంగరక్ష ఛార్జర్ అని కూడా పిలుస్తారు.