బెంగళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
బెంగళూరు : బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికులను కూడా తనిఖీలు చేసిన అనంతరం అది ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారించారు.
ఎయిర్‌పోర్టు కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం తెల్లవారుజామున 3:50 గంటలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంట పాటు ఎయిర్‌పోర్టు పరిసరాలు, టర్మినల్ బిల్డింగ్స్‌తో పాటు అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిర్‌పోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

