HMPV | హెచ్ఎంపీవీ వైరస్.. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల స్క్రీనింగ్..!
HMPV | దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
HMPV | దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ పెరుగుదల నేపథ్యంలో సివిల్ సర్జన్లందరికీ ఒక సలహా జారీ చేసినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి ఆర్టీ సింగ్‌రావు తెలిపారు. హర్యానాలో ఇప్పటివరకు ఒక్క హెచ్ఎంపీవీ కేసు రికార్డవలేదని.. అయితే, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
హెచ్ఎంపీవీ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వాలు నిఘాను పెంచాయి. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్క్రీన్ చేస్తున్నారు. దగ్గు, జలుబుతో ఆసుపత్రులకు వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాటిని స్క్రీన్ చేయడంతో పాటు పలు రాష్ట్రాల్లో రోగులను ఉంచేందుకు ఐసోలేషన్ వార్డులను సైతం సిద్ధం చేస్తున్నారు. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా లేని వ్యక్తులకు ప్రమాదకరం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

