HMPV | నాలుగేళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ.. గుజరాత్లో 8కి చేరిన కేసుల సంఖ్య
HMPV | నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్లో ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్లు వెల్లడించారు.
అహ్మదాబాద్: నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్లో ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్లు వెల్లడించారు. జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. ఎస్జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలుడికి హెచ్ఎంపీవీ సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు.
కాగా, గుజరాత్లో ఇప్పటి వరకు 8 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

