Karnataka: ఉచిత బస్సు ప్రయాణం కోసం బుర్కా ధరించి ముస్లీం మహిళ అవతారమెత్తిన వ్యక్తి
Karnataka: బుర్కా ధరించి బస్సుల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని కర్నాటకలో పట్టుకన్నారు. బస్సు స్టాప్‌లో ఉన్న అతను అనుమానంగా వ్యవహరిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నాటక సర్కార్ మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ కోసమే అతను ఆ వేషం వేసినట్లు తెలుస్తోంది.
బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో ఓ వ్యక్తి.. ముస్లిం మహిళలు ధరించే బుర్కాను వేసుకున్నాడు. బుర్కాతో ఉన్న ఆ వ్యక్తిని ధార్వాడ్ జిల్లాలో గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న అతన్ని పట్టుకున్నారు. కర్నాటకలో ప్రస్తుతం శక్తి యోజన కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి బుర్కా ధరించి మహిళా అవతారమెత్తినట్లు తెలుస్తోంది. బుర్కా ధరించిన వ్యక్తిని వీరభద్రయ్యగా గుర్తించారు.
బస్సు స్టాప్‌లో ఒంటరిగా ఉన్న అతనిపై అనుమానం రావడంతో స్థానికులు అతన్ని నిలదీశారు. యాచన కోసమే బుర్కా ధరించినట్లు అతను చెప్పాడు. కానీ అతను ఇచ్చిన వివరణతో అక్కడున్నవాళ్లు సంతృప్తి పడలేదు. శక్తి యోజన కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం అతను బుర్కా వేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అతని వద్ద ఓ మహిళకు చెందిన ఆధార్ కార్డు కూడా ఉంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలు వాగ్దాలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆ పార్టీ తమ ఎజెండాలో పేర్కొన్నది. దానిలో భాగంగానే శక్తి యోజన కింద ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

