గసగసాల పంటను ధ్వంసం చేసిన పోలీసులు

సిమ్లా : అక్రమంగా సాగుచేస్తున్న గసగసాల పంటను(పాపీ ప్లాంట్స్)ను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలోని చౌహర్ లోయలో చోటుచేసుకుంది. 16.5 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఈ గసగసాల పంటను సాగు చేస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేసి పంటను ధ్వంసం చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ 18 కింద నిందితులపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు.
డ్రగ్స్ మాఫియా ముఠాలు హెరాయిన్, మార్ఫిన్ తయారీకి మారుమూల గ్రామాల్లో రైతులను ప్రలోభపెట్టి రహస్యంగా ఈ పంటను సాగుచేయిస్తుంటాయి. గసగసాల కాయల నుంచి వచ్చే జిగురును హెరాయిన్ తయారీకి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఔషధాల తయారీలో మత్తు కలిగించే మార్ఫిన్ తయారీకి కూడా గసగసాల కాయలను ముడిసరకుగా ఉపయోగిస్తారు. కాయలోని గసాలను వంటలకు వాడుతారు.


Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

