Himachal Pradesh CM: రూ.2000 కోట్ల సాయం కోరిన హిమాచల్ సీఎం
Himachal Pradesh Floods: సాయం కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కేంద్రాన్ని కోరారు. తాత్కాలిక సహాయం కింద ఆ అమౌంట్ ఇవ్వాలని అభ్యర్థించారు. వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా పెంచనున్నట్లు ఆయన చెప్పారు. వారం క్రితం భారీ నుంచి అతి భారీ వర్షాలు హిమాచల్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే.
షిమ్లా: ఆకస్మిక వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) అతలాకుతలమైన విషయం తెలిసిందే. అయితే సాయం కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు( Sukhvinder Singh Sukhu) కేంద్రాన్ని కోరారు. తాత్కాలిక సహాయం కింద ఆ అమౌంట్ ఇవ్వాలని అభ్యర్థించారు. వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా పెంచనున్నట్లు ఆయన చెప్పారు. వారం క్రితం భారీ నుంచి అతి భారీ వర్షాలు హిమాచల్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. దీంతో అన్ని నదులూ ఉప్పొంగాయి.రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం అమిత్ షాతో మాట్లాడానని, తాత్కాలిక రిలీఫ్‌గా రెండు వేల కోట్లు ఇవ్వాలని షాను కోరినట్లు సుఖు తెలిపారు.
రాష్ట్రంలో వర్షాల వల్ల సుమారు నాలుగు వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి లక్ష నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అయితే ఆ పరిహారాన్ని పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి బాధితుడికి 5వేలు ఇస్తున్నారు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌ను ఏర్పాటు చేశామని, తమ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

