ఒక్కరోజులో దేశంలో వెలుగుచూసిన కరోనా కేసులు 3,14,835

- ఇప్పటివరకూ ఏ దేశంలోనూ నమోదు కాని రికార్డు
- కొనసాగుతున్న కరోనా ప్రళయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కొవిడ్ ప్రళయం అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలోనూ ఒక్కరోజులో నమోదు కానన్ని కేసులు మనదేశంలో 24 గంటల్లో నమోదయ్యాయి. బుధవారం నుంచి గురువారం ఉదయానికి 3,14,835 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,59,30,965కు చేరింది. బుధవారం దేశవ్యాప్తంగా 16,51,711 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 3,14,835 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఉదయం వెల్లడించింది. 2,104 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 1,84,657కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల 14.38 శాతం అంటే ఆ సంఖ్య 22,91,428కి పెరిగింది. ఇప్పటివరకు 1,34,54,880 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 84.46 శాతానికి పడిపోయింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.16 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 61,911, కర్ణాటకలో 13,762, తమిళనాడులో 13,258, ఢిల్లీలో 12,887, పశ్చిమబెంగాల్లో 10,710, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10,346 కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona virus
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

