High alert in Nuh | రేపు శోభాయాత్రకు వీహెచ్‌పీ పిలుపు.. అనుమతి లేదన్న హర్యానా సీఎం, నూహ్‌లో టెన్షన్
High alert in Nuh | ఇటీవల అల్లర్లు చెలరేగిన బీజేపీ పాలిత హర్యానాలోని నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ( High alert in Nuh) నెలకొన్నాయి. సోమవారం అక్కడ శోభాయాత్ర చేపట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ సన్నద్ధమయ్యాయి. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. యాత్రపై వెనక్కి తగ్గబోమని వీహెచ్‌పీ తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
చండీగఢ్: ఇటీవల అల్లర్లు చెలరేగిన బీజేపీ పాలిత హర్యానాలోని నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ( High alert in Nuh) నెలకొన్నాయి. సోమవారం అక్కడ శోభాయాత్ర చేపట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ సన్నద్ధమయ్యాయి. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా యాత్ర చేపట్టవద్దని ఆ రెండు సంస్థలకు సూచించారు. స్థానిక ఆలయాల్లో పూజలు నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.
కాగా, నూహ్‌లో సోమవారం తలపెట్టిన శోభాయాత్రపై వెనక్కి తగ్గబోమని వీహెచ్‌పీ తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని నిర్వహిస్తామని వీహెచ్‌పీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నూహ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు, 24 కంపెనీల పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రజలు గుమిగూడటాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్‌ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
జూలై 31 నూహ్ జిల్లాలో వీహెచ్‌పీ చేపట్టిన యాత్రపై దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన హింస, అల్లర్లలో ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. పలు ఇండ్లు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ అల్లర్లు గురుగ్రామ్ వరకు వ్యాపించాయి.
మరోవైపు ఈ అల్లర్ల కారణంగా ఆగిపోయిన యాత్రను అక్కడి నుంచి సోమవారం తిరిగి కొనసాగించాలని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నిర్ణయించాయి. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ యాత్రను చేపడతామని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో నూహ్‌లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

