పోర్న్ వీడియోలు తీయడం, చూడటం నేరమా? చట్టాలు ఏం చెబుతున్నాయి?

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ వీడియోలు చేశాడన్న కేసులో అరెస్టయిన సంగతి తెలుసు కదా. తమతో అతడు పోర్న్ మూవీస్ చేసినట్లు పలువురు యువ నటీమణులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ అతన్ని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అసలు పోర్నోగ్రఫీ గురించి భారత చట్టాలు ఏం చెబుతున్నాయి? అశ్లీల వీడియోలు తీయడం, చూడటం చట్ట ప్రకారం నేరమా? రాజ్ కుంద్రా నేరం నిరూపితమైతే ఎన్నేళ్ల శిక్ష పడనుంది?
చట్టం ఏం చెబుతోంది?
ఇండియాలో పోర్నోగ్రఫీకి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్‌లో మూడు సెక్షన్లు ఉన్నాయి. 292, 293, 294. అంతేకాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 67ఎ కూడా అశ్లీల చిత్రాలకు సంబంధించినదే. అయితే ఈ చట్టం ప్రకారం ఇండియాలో పోర్న్ లేదా అశ్లీల కంటెంట్‌ను చూడటం, చదవడం నేరం కాదు. 2015 జులైలో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో నాలుగు గోడల మధ్య పోర్న్ చూడటం అనేది చట్టబద్ధమే. ఇది నేరం కింద పరిగణించకూడదు. కానీ ఆ వీడియోలను తీయడం, ప్రచారం చేయడం, పంపిణీ చేయడం మాత్రం నేరంగా పరిగణిస్తారు.
సెక్షన్ 292 అనేది అశ్లీలం అంటే ఏంటో వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వీటిని చేయడం, పంపిణీ చేయడం నేరంగా పరిగణిస్తూ తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష, రెండోసారి అయితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇక సెక్షన్ 293 అనేది ఇలాంటి అశ్లీల వీడియోలు తీయడం వాటిని 20 ఏళ్లలోపు యువతకు పంపిణీ చేయడానికి సంబంధించినది.
ఇక సెక్షన్ 294 అనేది పబ్లిగ్గా తమ చర్యలు, పాటల ద్వారా అశ్లీలాన్ని ప్రదర్శించడం గురించి చెబుతోంది. బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల పాటలు పాడటం, ఉచ్ఛరించడం అనేది నేరంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం రాజ్‌కుంద్రాపై ఈ మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మహిళలు, పిల్లలు ఉంటే..
ఒక వేళ ఇందులో మహిళలు, చిన్న పిల్లలు కనుక ఉంటే వేరే సెక్షన్ల కింద కూడా కేసులు నమోదవుతాయి.
పిల్లల విషయంలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం, 2012 కింద కేసు నమోదు చేస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం పోర్నోగ్రఫీలో పిల్లలను భాగం చేయడం నేరం. ఇక మహిళల విషయంలో ఇన్‌డీసెంట్ రిప్రజెంటేషన్ ఆప్ విమెన్ (ప్రొహిబిషన్) చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. రాజ్‌కుంద్రాపై ఈ చట్టంలోని సెక్షన్ 3, 4, 6, 7 కింద కూడా కేసులు నమోదయ్యాయి.
ఐటీ చట్టం సెక్షన్ 67ఎ
పోర్నోగ్రఫీ విషయంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 67ఎను కూడా ప్రయోగిస్తారు. అశ్లీల కంటెంట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేయడం, షేర్ చేయడం అనేది ఈ సెక్షన్ కింద నేరం. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. రెండోసారి నేరం చేస్తే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

